త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమానే చేయబోతున్నాడు. ఇప్పటికే దర్శుకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కథను పక్కాగా రెడీ చేసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ మొదటిగా సమంతను ఫైనల్ చేసాడనే వార్త టాలీవుడ్ లో వినపడింది.
అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. మరల ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డేని, దర్శకుడు త్రివిక్రమ్ రిపీట్ చేయనున్నాడని గుసగుసలు కూడా వినపడ్డాయి. అయితే అందులో కూడా నిజం లేదని తేలింది. తాజాగా ఈ సినిమాకు ‘మహానటి’ ఫెమ్ కీర్తి సురేష్ ను తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తన సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యమైనదని, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్ర అని, అందుకనే కీర్తి కురేష్ ను తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. త్వరలోనే కీర్తి సురేష్ ను కలిసి కథను వినిపించనున్నాడని తెలుస్తోంది.
సహజంగానే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం కావడం వలన కథపై దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సినీ జీవితంలోనే ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.











