సుధా కొంగర దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా‘. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, సూర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈమధ్యనే అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంత చేసుకుంది. డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈమధ్య కాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతున్న సూర్యకు ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా భారీ ఊరటను ఇచ్చింది అనడంలో సందేహం లేదు.
Must Read: ఆకాశం నీ హద్దురా (రివ్వ్యూ)
అలాగే వరుస ఫ్లాపులతో డీలా పడిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఒక భారీ నిర్మాణ సంస్థ భావిస్తోందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా కోసం షాహిద్ కపూర్ ను సంప్రదించినట్లు సమాచారం. సూర్య పాత్రకు షాహిద్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. షాహిద్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన నటీనటుల ఎంపికను మొదలుపెడతారని తెలుస్తోంది.
ఈ హిందీ రీమేక్ సినిమాకు కూడా సుధా కొంగరకే దర్శకత్వం బాధ్యతలు అప్పగించే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా షూటింగ్ మొదలుపెడతారని టాక్ నడుస్తోంది. తెలుగు, తమిళ్ భాషలలో హిట్ అయిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే షాహిద్ కపూర్ యాక్ట్ చేస్తున్న సినిమాలు కరోనా కారణంగా షూటింగ్లు లేట్ అయ్యాయి. షూటింగ్లకు అనుమతి రావడంతో షాహిద్ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. మరి ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ కు తను ఓకే చెప్తాడో లేదో చూడాలి మరి.
Also Read: సుధా కొంగర దర్శకత్వంలో తమిళ తల?











