కేజీఎఫ్ 2 సినిమా సంచలనాలకు తెరతీయబోతోంది. రేపు ఉదయం 10.18 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. కన్నడ హీరో యశ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను దాదాపు పూర్తి చేసుకుంది. రేపు హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ చిత్రం అనేక భాషల్లో హిట్ అయ్యింది. దాని సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఓ కీలక పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పత్రిక కటింగ్ ను కూడా చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. పాత పత్రిక కటింగ్ లాగా దీన్ని డిజైన్ చేశారు.
అధీర ఎలా బతికున్నాడు? అంటూ బ్యానర్ హెడ్డింగ్ తో ఓ కథనాన్ని కేజీఎఫ్ టైమ్స్ ప్రచురించినట్టుగా ఉంది. చరిత్రకు రాజులు బానిసలు కానీ.. రాఖీ చరిత్ర సృష్టించినోడు లాంటి శీర్షికలతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఈ పత్రిక కటింగ్ ఉంది. బహుశా పాత కథని ఇలా తెలిపే ఉద్ధేశం కూడా కావచ్చు. మరో రెండు నెలల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 5 భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాగా ఈ పాన్ ఇండియా మూవీ ఉంటుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
Must Read ;- ‘కేజీఎఫ్ 2’ కొనేసిన మలయాళ స్టార్ హీరో.. !