ఎలాంటి అంచనాలు లేకుండా.. పాన్ ఇండియా మూవీగా బరిలోకి దిగి.. ప్రపంచ వ్యాప్తంగా అదరగొట్టిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ప్ కనకవర్షం కురిపించిన ఈ సినిమాతో కన్నడ యంగ్ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడీ సినిమాకి రెండో చాప్టర్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
మొదటి భాగంలో నటించిన కొందరు.. రెండో భాగంలోనూ నటిస్తున్నా.. అదనంగా రవీనా టండన్ ను, ప్రకాశ్ రాజ్ ను, విలన్ గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను తీసుకొని మరింత హైప్ క్రియేట్ చేశాడు దర్శకుడు. అలాంటి ఈ సినిమా టీజర్ ను యశ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 8న విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే.. ‘కేజీఎఫ్ 2’ మలయాళ వెర్షన్ ను మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ కొనేశాడు. ఆయన ఈ సినిమాను కేరళ మొత్తం ఈ సినిమాను పంపిణీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పృధ్విరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలయచేశాడు. వచ్చేఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉన్న ‘కేజీఎఫ్ 2’ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నారు.
Must Read ;- క్లైమాక్స్ ఫైట్స్ అద్భుతంగా వస్తున్నాయట.. !
KGF 2.
Prithviraj Productions is proud to present KGF 2. Like millions of you..I too am waiting to see Rocky’s tale unfold! 😊 @PrithvirajProd @hombalefilms @VKiragandur @TheNameIsYash @prashanth_neel @duttsanjay #Karthik #KGFChapter2 @PrithviOfficial pic.twitter.com/tC4uAESkI1— Prithviraj Productions (@PrithvirajProd) January 4, 2021