కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘కేజీయఫ్ 2‘. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ అధీరా అనే విలన్ పాత్ర చేస్తున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అయిన విషయం మనకు తెలిసిందే. తిరిగి షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర బృందం ఈ మధ్యనే క్లైమాక్స్ సన్నివేశాల కోసం హైదరాబాద్ చేరుకున్నారు. చిత్రం కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో క్లైమాక్స్ సన్నివేశాలను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

‘ఈ రోజు పక్కా మాస్ క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ పూర్తయింది. నాకు మంచి టీం దొరికింది. సంజయ్ దత్ ఆయన లైఫ్ లో ఒక నిజమైన యోధుడు. యశ్ తో సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘కేజీయఫ్ 2’ సినిమాను ప్రపంచ థియేటర్స్ లో చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అని పోస్ట్ చేశారు దర్శకుడు. అంతేకాకుండా డిసెంబర్ 21వ తేదీన అంటే ఈ రోజు .. ఉదయం 10గంటల 8నిమిషాలకు ఒక సరికొత్త అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు తెలిపాడు. ఆ అప్డేట్ కోసం యశ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
‘కేజీయఫ్ 1’ సినిమా విడుదలైన ప్రతీ భాషలోనూ భారీ విజయం సాధించింది. ఇప్పటి వరకు కన్నడ చిత్ర సీమలో ఏ చిత్రం వసూళ్లు చేయని విధంగా ఈ సినిమా భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- కేజీఎఫ్ 2 టీజర్ అప్ డేట్ వచ్చేసింది
https://twitter.com/prashanth_neel/status/1340546858435760129











