అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. విభిన్న కథా చిత్రాల్లో పెర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వనుందని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలని మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
ఈ సీక్వెల్ లో రామ్ చరణ్ కి జంటగా అతిలోక సుందరి తనయ జాన్వీకఫూర్ అయితే.. బాగుంటుందని.. అలాగే జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ మూవీ అని ప్రచారం జరిగింది కానీ.. ఈ క్రేజీ సీక్వెల్ వార్తలకే పరిమితం అయ్యింది కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇదిలా ఉంటే.. జాన్వీకపూర్ ను సౌత్ లో ఫేవరేట్ హీరో ఎవరు అని అడిగితే.. విజయ్ దేవరకొండ అని చెప్పింది. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్ లో జాన్వీ కపూర్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.
జాన్వీని పూరి కాంటాక్ట్ చేయడం కూడా జరిగిందట. అయితే.. ఏమైందో ఏమో కానీ ఈ సినిమాకి కూడా జాన్వీ ఓకే చెప్పలేదు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించనున్న సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు జాన్వీకపూర్ ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది. క్రియేటీవ్ జీనియస్ గా పేరున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఈ భారీ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారని తెలిసింది. బోనీకఫూర్ చాలా గ్రాండ్ గా జాన్వీ కపూర్ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో ఓ మాంచి ముహుర్తాన ఈ సంచలన చిత్రానికి సంబంధించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం.
Must Read ;- లైగర్ రిలీజ్ డేట్ ఖరారు