అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ కి పరిచయమైనప్పటికీ.. కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్న అందాల తార జాన్వీకపూర్. అయితే.. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు.? ఏ సినిమాతో అనేది మాత్రం క్లారిటీ లేదు. టాలీవుడ్ బడా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ జాన్వీని టాలీవుడ్ లో పరిచయం చేయాలని ట్రై చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇటీవల మళ్లీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏంటంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందనుంది. దీనికి అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కనుక దీనిని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా జాన్వీకపూర్ ని టాలీవుడ్ లో పరిచయం చేయనున్నారని.. దీనికి బోనీకపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి త్వరలో ఎనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ నెక్ట్స్ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని జాన్వీ కపూర్ తో చేయాలనుకుంటున్నారని తెలిసింది. జాన్వీని దృష్టిలో పెట్టుకునే కథను రెడీ చేశారని.. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని.. జాన్వీ కూడా ఇంట్రస్టింగ్ గా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ పై మరింత ఆసక్తి పెరిగింది. మరి.. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందో..? లేక.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీతో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
Must Read ;- ‘ఎన్టీఆర్’ మూవీతో మన్మథుడు హీరోయిన్ రీ ఎంట్రీ?











