అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వెండి తెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటినుంచే బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు ఆమెను వెండి తెరకు పరిచయం చేయడానికి పోటీ పడుతున్నారు. ఈమధ్య కాలంలో ఖుషీ కపూర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం ఇప్పటివరకు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ని ప్రైవేట్‌లో పెట్టిన ఖుషీ ఇప్పుడు ఆ అకౌంట్‌ని పబ్లిక్ చేయడమే.

అప్పటి నుండి ఈ అమ్మడుకి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది ఖుషీ. ఆమె రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. అందులో ఖుషీ తన కుడి చేతికి రెండు సరికొత్త పచ్చబొట్లతో కనిపించింది. ఈ ఒక్క ఫొటోతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అంతేకాకుండా గోధుమ రంగు ప్యాంట్, తెలుపు రంగు స్లీవ్ లెస్ టీ షర్ట్ దానిపై లేత బూడిద రంగు కోటు, అలాగే మెడలో నీలం రంగు హ్యాండ్ బ్యాగ్ ధరించి గ్లామర్ గా కనబడుతోంది. ఈ ఫొటోలో సెల్ఫీ క్లిక్ చేయడానికి ఖుషీ చేతికున్న రెండు పచ్చబొట్లను చూడవచ్చు. అందులో ఒకటి పువ్వు పచ్చబొట్టు కాగా రెండవది ఒక ఇంగ్లీష్ కొటేషన్. ఆమెకు పచ్చబొట్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఖుషీ శరీరంపై కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలు రోమన్ సంఖ్యలలో ఉండగా, ఆమె బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా ఉంది. తను షేర్ చేసిన ఫొటోకు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. కాబోయే బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఖుషీ అంటూ ఆమె ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. మరి ఆమె సినీ జీవితం ఎలా ఉంటుందో మున్ముందు చూడాలి.
Must Read ;- బాలీవుడ్లో మెరవనున్న హైదరాబాదీ బ్యూటీ అమ్రిన్ ఖురేషి
https://www.youtube.com/watch?v=ZyDn8hZpShk










