అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. అనే సామెత చందంగా తయారైంది వ్యవహారం! అసలే తానొక సెలబ్రిటీ అనే నిషా తలకెక్కి ఉన్నాడు.. పైగా పీకల్దాకా పూటుగా తాగి మరింత నిషాను తలకెక్కించుకున్నాడు. టీవీ సీరియల్ హీరో ఆ మత్తులో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యంగా మాట్లాడుతూ.. వారి మీద దౌర్జన్యానికి దిగాడు. దీంతో సదరు హీరోపై పోలీసు కేసు నమోదు అయింది. వివరాలిలా ఉన్నాయి.
కోయిలమ్మ టీవీ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ పై రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. తాగిన నిషాలో మణికొండ లో ఇద్దరు అమ్మాయిలపై సమీర్ దౌర్జన్యానికి దిగినట్లు మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చిపోయిన కోయిలమ్మ హీరో ఇప్పుడు కటకటాల పాలయ్యే పరిస్థితి వచ్చింది.
రాత్రి తొమ్మిది గంటలకు మహిళ ఇంటికెళ్లి దాడి చేయడంతో పాటు, ఆమె దగ్గరున్న వస్తువులను లాక్కెళ్లి లైంగిక వేధింపులు చేశారని బాధిత మహిళ పిర్యాదు చేసింది. అమర్ తో పాటు ముగ్గురు, అమర్ గర్ల్ ఫ్రెండ్ స్వాతి దౌర్జన్యానికి పాల్పడ్డారని పిర్యాదు చేశారు.
చిరు వ్యాపారం చేసుకుంటున్న శ్రీవిద్య అపర్ణల పై దాడికి పాల్పడి అయిదు లక్షల నగదు తీసుకున్నారు. అడిగితే రౌడీయిజం చేస్తున్నారంటూ.. మహిళలు రాయదుర్గం పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు
వీళ్ల నుంచి ప్రాణహాని ఉందంటూ బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మహిళలకి రక్షణ ఇచ్చి కోకిలమ్మ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ హీరో, ఈ దౌర్జన్యం కేసులో అసలు సంగతి ఏమిటో తెలియాల్సి ఉంది.
Must Read ;- స్టార్ మా సీరియల్ గా ‘రుద్రమదేవి’చరిత్ర