కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ తరపున సాగర్‌లో పోటీ చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారని, అయితే తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ఒక వేళ తాను పోటీలో నిలిస్తే జానారెడ్డికి మూడోస్థానమే దక్కుతుందన్నారు. తాను రంగంలోకి దిగితే కనుక, అప్పుడు పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకే సాధ్యమని ఈ సందర్భంగా అన్నారు.
అయితే నిజంగా బీజేపీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిని సంప్రదించిందా లేక రాజగోపాల్ రెడ్డి కావాలనే వ్యాఖ్యలు చేస్తున్నారా.. అనే విషయమై పలువురు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిస్తే సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది.
Must Read ;- సాగర్ నాది, అంతా నేనే చూసుకుంటా.. జానా ధైర్యం