ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరికీ తెలియకుండా ఉన్నట్టుండి సుప్రీం కోర్టులో ఉన్నత స్థానంలో ఉన్న ఓ న్యాయమూర్తి పై సీజేకు లేఖ రాయడంపై ఇప్పుడు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కేసుల విచారణ ఆలస్యం చేయడానికేనా..?
న్యాయవ్యవస్థను భయపెట్టి తనకు అనుకూలమైన ప్రయోజనాలను పొందాలనుకున్న ఉద్దేశంతోనే ఏపీ సీఎం జగన్ న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సీజేకు రాసిన లేఖను తిరస్కరించాలంటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఆంధ్ర ప్రదేశ్ యూనిట్) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకి విజ్ఞప్తి చేసింది. దీని గురించి సంస్థ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ సీజేకు ఓ లేఖ రాశారు.
31 కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి అదే వ్యవస్థపై యుద్ధం ప్రకటించడం దారుణమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు ఆయన న్యాయ వ్యవస్థ లపై యుద్ధం ప్రకటించడానికి అసలు ముఖ్య కారణం ఆయన 31 కేసుల్లో విచారణ ఆలస్యం జరిపించేందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనాలోచిత, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్నందునే ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయన మద్దతుదారులు న్యాయస్థానంపై నిరంతర దాడి మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అందించే ఏకైక వ్యవస్థగా హైకోర్టు ఒక్కటే మిగిలిందని అది సహించలేకే ప్రభుత్వం దాని పై యుద్ధానికి దిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలను, న్యాయమూర్తుల గురించి ఆవహేళన చేస్తున్న వారిపై కఠిన చర్యలుు తీసుకోవాలంటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఆంధ్ర ప్రదేశ్ యూనిట్) కోరింది. (ఇది చదవండి: జగన్‌కు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం!)
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పైనా, రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థ పైనా అభ్యంతర ఆరోపణలు గుప్పించారు. గతేడాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా తయారయ్యాయి. ఇంతటితో ఆగకుండ రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలన్నీ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, ఇతర న్యాయమూర్తులపై నోరు పారేసుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. దాన్ని బట్టి జగన్ నిర్ణయాలు అనాలోచితంగా, అసంబద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.
అసలు ఆ లేఖ ఎందుకు రాశారు..? సానుభూతి కోసమేనా..?
జగన్ రాసిన లేఖలో వీసమెత్తు నిజం కూడా లేదు. అందుకే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. సీజే నుంచి సానుభూతి పొందాలనే ఆ లేఖ రాసినట్లు అనిపిస్తోంది. అబద్ధాలతో కూడిన ఆ లేఖను సీఎం తన సొంత ఛానల్ ద్వారా బయటపెట్టడం అధికార రహస్యాలను కాపాడతాననిి రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే కాకుండా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారర్చడమే అవుతుంది.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రోస్టర్ సహా న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించడం పూర్తిగా కోర్టు ధిక్కారమే. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. (ఇది చదవండి: జగన్ తీరును ఖండిస్తే.. ఎవరినైనా బెదిరిస్తారా?)
అసలు ఆయనెక్కడ ఉన్నారు ఇప్పుడు?
ముఖ్యమంత్రి జగన్ సీజేకు రాసిన లేఖను మీడియా ముందు ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లాంరెడ్డి తరువాత ఆయన ఎక్కడ కనిపించలేదు. ఒక కోర్టులో తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా, కోర్టు తీర్పులను తప్పుపట్టి అజయ్ కల్లాంరెడ్డి పెద్ద తప్పే చేశారని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఆయన అరెస్ట్ తప్పదనే వార్తలు గుప్పుమనడంతో అజయ్ కల్లాంరెడ్డి ఎక్కడా కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అవకాశం ఇచ్చిన వారిపై ఆయుధాలు ఎక్కుపెట్టారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అజయ్ కల్లాంరెడ్డికి కీలక పదవులు అప్పగించారు. నెల రోజుల సర్వీసు ఉందని తెలిసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. ప్రభుత్వం మారగానే అజయ్ కల్లాంరెడ్డి చంద్రబాబుపైనే ఆయుధాలు ఎక్కుపెట్టారు. అమరావతిలో 6 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని పెద్ద పుస్తకాలే రాసి విడుదల చేశారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకున్నారు..
అప్పుడు దక్కించుకునేందుకు.. ఇప్పుడు నిలబెట్టుకునేందుకు
గతంలో చంద్రబాబును తిట్టటి పదవులు దక్కించుకున్నారు. నేడు ఆ పదవులు నిలుపుకునేందుకు ఏకంగా న్యాయమూర్తుల తీర్పులపైనే విమర్శలు చేస్తున్నారు అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులపై ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి అజయ్ కల్లాంరెడ్డి పెద్ద తప్పే చేశారని న్యాయనిపుణులు పెదవి విరుస్తున్నారు. ( కనబడుటలేదు : అజ్ఞాతంలో ముఖ్యమంత్రి సలహాదారు!)