సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ముంబాయిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి చేస్తున్న సినిమా కావడం.. అలాగే విజయ్ చే్స్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో లైగర్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు విజయ్, పూరి అభిమానులు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో అత్యధిక లైక్‌లు రాబట్టుకుని దక్షిణాది చిత్రాల్లో తొలి ఫస్ట్‌లుక్ పోస్టర్‌గా నిలిచింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2 మిలియన్లకు పైగా లైక్స్‌ను సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఇప్పటికే ఈ మూవీలో విజయ్ సరికొత్త లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ కోసం విజయ్ పూర్తిగా తన లుక్‌ను మేకోవర్ చేసుకున్నాడు.
పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. మరి.. అనౌన్స్ చేసినట్టుగా సెప్టెంబర్ 9న లైగర్ మూవీని అనౌన్స్ చేస్తారో లేదో తెలియాల్సివుంది.
Muts Read ;- మగాళ్లను దూరం పెట్టమంటున్న పూరి