నారాసుర రక్తచరిత్ర అంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నారా చంద్రబాబు, లోకేష్ పాత్ర ఉందంటూ ఓ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్యలో తమ కుటుంబానికి సంబంధం లేదని తిరుపతి వెంకన్న సాక్షిగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద నారా లోకేష్ ప్రమాణం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో మా కుంటుంబానికి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తున్నా, బాబాయి హత్యతో తనకు సంబంధం లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయాలని ఈ నెల 7వ తేదీన ప్రచారంలో నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆయన ఆ రోజు ప్రకటించినట్లుగా ఇవాళ అలిపిరిలోని గరుడ సర్కిల్ దగ్గర ప్రమాణం చేశారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్‌రెడ్డి తేల్చాలని డిమాండ్ చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇక రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నారా లోకేష్ ప్రశ్నించారు.
సవాల్ స్వీకరిస్తారా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విసిరిన సవాల్ వైసీపీ నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నిలకు ముందు వివేకానందరెడ్డిని నారా చంద్రబాబు నాయుడే హత్య చేయించాడని వార్తలు రాసిన ఓ ప్రధాన పత్రిక కథనాల పేజీలను లోకేష్ మీడియాకు ప్రదర్శించారు. వివేకానందరెడ్డి హత్యతో సంబంధం లేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి సీఎంకు సవాల్ విసిరారు. ఈ సవాల్ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై పెద్దగా స్పందించని వైసీపీ నేతలు లోకేష్ సవాల్ స్వీకరిస్తారా లేదా వేచి చూడాల్సిందే.
Must Read ;- వివేకా హత్య కేసులో కదలిక.. అందుకేనా?