వైసీపీ ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేకరణ చేయిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పోస్కో కంపెనీ ప్రతినిధులతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు చర్చలు జరిపిన, విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని ఆయన ప్రశ్నించారు. 2019లోనే పోస్కో కంపెనీ కేంద్రంతో ఎంవోయూ చేసుకున్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రజలకు తెలియకుండా దాచిందని ఆయన తప్పుపట్టారు. వైసీపీ రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ప్రజలు ఛీ కొడుతున్నా… ఆయన విశాఖను వదలడం లేదని లోకేష్ ఎద్దేవా చేశారు.
ప్రైవేటీకరణ ఒక కుట్ర..
లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా అడ్డుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు. ఇప్పటికే విశాఖ టీడీపీ పార్లమెంటు ఇన్ ఛార్జి పల్లా శ్రీనివాసులు నిరాహారదీక్ష చేపట్టారని ఆయన గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని లోకేష్ పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను తక్కువ ధరకు కొట్టేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని తీరతామని లోకేష్ మంగళగిరిలో స్పష్టం చేశారు.
Must Read ;- మూడేళ్ల క్రితమే స్కెచ్.. విశాఖ ఉక్కును ‘పోస్కో’ పరం చేసేస్తారా?











