Maa Election Official Result :
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు అధికారింకా ప్రకటించారు. ఈ అసోసియేషన్ లో 883 ఓట్లు ఉండగా అందులో 605 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54 మంది పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేశారు. 72 శాతం పోలింగ్ నమోదైంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయగా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచారు.
మంచు విష్ణుకు 381 ఓట్లు, ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు లభించాయి. 107 ఓట్ల మెజారిటీతో మంచు విష్ణు విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు ఓట్ల ఆధిక్యంతో నటి జీవితపై గెలిచారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్గా మాదాల రవి, బెనర్జీ, కోశాధికారిగా శివబాలాజీ, జాయింట్ సెక్రెటరీలుగా గౌతం రాజు, ఉత్తేజ్ గెలుపొందారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంది,
మంచు విష్ణు ప్యానల్ నుంచి 10 మంది ఈసీ మెంబర్లుగా విజయం సాధించారు. శివారెడ్డి, గీతాసింగ్, అశోక్ కుమార్, బ్రహ్మాజీ, శ్రీలక్ష్మి, మానిక్, ప్రభాకర్, తనీష్, శ్రీనివాసులు, హరినాథ్ బాబు, సురేష్ కొండేటి, శివనారాయణ, సంపూర్నేష్‌బాబు, శశాంక, సమీర్, సుడిగాలి సుధీర్, బొప్పాల విష్ణు, కౌశిక్ ఈసీ మెంబర్లుగా గెలిచారు. వీరిలో అత్యధికంగా శివారెడ్డికి ఓట్లు లభించాయి. ఆయనకు 362 ఓట్లు వచ్చాయి.
Must Read ;- నాగబాబు, ప్రకాష్ రాజ్ బాటలో శివాజీ రాజా











