మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేసిన మంచు విష్ణు గెలుపొందారు. ఆయనపై పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో దాదాపు 665 ఓట్లు పోలవ్వగా వాటిలో 50 ఓట్లు చెల్లలేదు. ప్రకాష్ రాజ్ మీద అత్యధిక ఓట్లు సాధించి మంచు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. భారీ మెజారిటీ లభించింది. ప్రకాష్ రాజ్ పై 127 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. మంచు విష్ణుకు 396 ఓట్లు పోలవ్వగా ప్రకాష్ రాజ్ కు 269 ఓట్లు పోలయ్యాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన జీవిత ఓటమి పాలయ్యారు. ఆమెపై పోటీచేసిన రఘుబాబు గెలుపొందారు. రఘుబాబు కేవలం ఏడు ఓట్ల తేడాతో గెలుపొందారు.
గెలుపొందిన ఆఫీస్ బేరర్లు
అధ్యక్షుడు : మంచు విష్ణు
ఉపాధ్యక్షులు : మాదాల రవి, బెనర్జీ
జనరల్ సెక్రటరీ: రఘుబాబు (గెలుపు)
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్,
ట్రెజరర్: శివ బాలాజీ
జాయింట్ సెక్రటరీలు: ఉత్తేజ్, గౌతమ్ రాజు
Must Read ;- విష్ణు గెలుపు.. ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలేంటి?











