సూపర్ స్టార్ మహేశ్ బాబు లాస్టియర్ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీలో నటిస్తున్నాడు. ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీమ్ .. త్వరలోనే హైద్రాబాద్ లో సెకెండ్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. బ్యాంకింగ్ రంగంలోని ఓ భారీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.
దాంతో ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందా అనే ఆత్రుత మొదలైంది అభిమానుల్లో. కరోనా కారణంగా ఇప్పటికే లేటయిన ఈ సినిమా షూటింగ్ కు ఇప్పుడు మరోసారి సెకండ్ వేవ్ సెగ తగులుతోంది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను తాల్కాలికంగా వాయిదా వేశారు. అందుకే ఆల్రెడీ దుబాయ్ లో చిత్రీకరించిన షెడ్యూల్ లోని కొన్ని హైలైట్ సీన్స్ తో టీజర్ ను కట్ చేయాలని భావిస్తున్నాడట దర్శకుడు పరశురామ్.
దుబాయ్ షెడ్యూల్ లో చిత్రీకరించిన ఓ భారీ ఫైట్ , అలాగే.. కథానాయిక కీర్తి సురేశ్ , మహేశ్ బాబు లపై కొన్ని రొమాంటిక్ సీన్స్.. సినిమాకి హైలైట్స్ కాబోతున్నాయట. ఇప్పుడు ఈ సీన్స్ తోనే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని టాక్. ఇక సర్కారు వారి పాట టీజర్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న విడుదల చేయబోతున్నారని సమాచారం. మరి వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే .. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- క్రేజీ అప్డేట్ : మహేశ్ బాబుతో జక్కన్న అరణ్యపర్వం