Mahesh Babu Birthday Special Video :
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. ఈ రోజున మహేశ్ బాబు పుట్టినరోజు కావడంతో సహజంగానే సందడి వాతావరణం మొదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘బర్త్ డే బ్లాస్టర్’ పేరుతో స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీ టచ్ ఇస్తూ వదిలిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు దుబాయ్ లో జరిగింది. అక్కగా భారీ చేజింగ్స్ ను .. యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ పైనే ఈ టీజర్ ను ఎక్కువగా కట్ చేశారు. ఆ తరువాత హీరో హీరోయిన్ కాంబినేషన్లో కామెడీని మిక్స్ చేసిన రొమాంటిక్ టచ్ తో టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కి మహేశ్ బాబు లుక్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఆయన మరింత హ్యాండ్సమ్ గా ఉన్నాడు.
మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. బ్యాంకు స్కామ్ కి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ ఎక్కువగా నడుస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హ్యాట్రిక్ హిట్ తో ఉన్న మహేశ్ ఈ సినిమాతో తన దూకుడును కొనసాగిస్తాడేమో చూడాలి.
Must Read ;- మొన్న ఫస్ట్ లుక్.. నేడు జిఫ్.. రేపు మహేష్ దూకుడే











