స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోలు పెళ్లెందుకు చేసుకోరు? ఇది నిజంగా మిలిడాలర్ ప్రశ్నే. బయటి ప్రపంచానికి వారి పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్త పడేవారు కొందరైతే, నిజంగా వారికి పెళ్లి కాకపోయినా పెళ్లియ్యిందని జరిగే ప్రచారాలు కూడా ఎక్కువే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇలాంటి అంశంతోనే వార్తలకెక్కారు. సల్మాన్ ఖాన్ కు పెళ్లయి ఓ కూతురు కూడా ఉందనే వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సల్మాన్ పెళ్లి చేసుకోక పోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి.
ఇప్పుడు సల్మాన్ వయసు నిజంగా చెప్పాలంటే 57 ఏళ్లు. ఆయన సినిమాల వయసు 34 ఏళ్లు. ‘మైనే ప్యార్ కియా’ ఆయన రెండో చిత్రమైనా హీరోగా గుర్తింపు తెచ్చింది మాత్రం అదే. ఈ మధ్యలో ఎన్నో ప్రేమ వ్యవహారాలు. సినిమా రంగంలో కలిసి తిరిగితే ఎన్నో పుకార్లు షికారు చేస్తాయి. ఐశ్వర్యారాయ్ తో మొదట్లో చెట్టపట్టాలేసుకు తిరిగారు. ఆ తర్వాత కత్రినా కైఫ్ తో తిరిగారు. ఈ ఇద్దరితోనూ వ్యవహారం బెడిసికొట్టింది. కత్రినాతో మళ్లీ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆయన డేటింగ్ వ్యవహారాల గురించి చెప్పాలంటే చాలానే రాయాల్సి ఉంటుంది.
సల్మాన్ కు పెళ్లయి 17 ఏళ్ల కూతురు ఉన్నట్లు వార్త. సాధారణంగా ఇలాంటి వార్తల మీద హీరోలు స్పందించరు. తమ వారసుల కోసమైనా హీరోలు పెళ్లి చేసుకోవలసిందే. చేసుకున్నప్పుడు దాచాల్సిన అవసరం కూడా లేదు. సల్మాన్ భార్య, కూతురు దుబాయ్ లో ఉంటున్నారన్నది మరో వార్త. దీనిపై స్పందిచాల్సిన అవసరముందని సల్మాన్ భావించినట్టుంది. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ‘పించ్’ అనే టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షోకు సల్మాన్ అతిథిగా హాజరైనప్పుడు సల్మాన్ గొంతు విప్పాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఈ షో ఉద్దేశం. సల్మాన్ మీద వచ్చే గాసిప్స్, ట్రోల్స్ గురించి అర్భాజ్ ఖాన్ ప్రశ్నలు లేవనెత్తారు. అడిగిన ప్రతి ప్రశ్నకూ సల్మాన్ సమాధానం చెప్పారు. ‘దుబాయ్ లో మీ భార్య, కూతురు ఉన్నారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.. నిజమేనా?’ అని అర్భాజ్ అడగ్గా ‘ఇలాంటి వార్తలు జనానికి ఎలా తెలుస్తాయో నాకు తెలీదు. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కూడా.
నా నోటి నుంచి చెప్పించాలనే ఇలాంటి ప్రయత్నాలు కావచ్చు. నా తొమ్మిదో ఏట నుంచి నేను ముంబైలో ఉంటున్నా. నాన్న కూడా నాతోనే ఉన్నారు’ అంటూ వివరణ ఇచ్చారు. అంటే తనపై వచ్చినవన్నీ రూమర్లేనని ఆయన సమాధానం ఇచ్చినట్లయింది. అయినా జనానికి మాత్రం ఏదో తేడా కొడుతోంది. ఏదేమైనా కాలమే నిర్ణయించాలి. సల్మాన్ పెళ్లి చేసుకుంటే ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టినట్లవుతుంది.
Must Read ;- బాలీవుడ్ ‘మాస్టర్’ ఇతడేనా?