నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ’. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న అఖండ సినిమా పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ అఖండ టీజర్ కు రికార్డ్ స్ధాయిలో వ్యూస్ రావడంతో అఖండ పై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. త్వరలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
టీజర్స్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు సాంగ్స్ కు కూడా తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్టు సమాచారం. ‘అఖండ’ మూవీ నుండి మొదటి పాటని ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ పాట బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మీద ఉంటుందని సమాచారం. ఆగస్ట్15న ఈ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో అఘోరా గా, ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు విశేషంగా ఆకట్టుకునేలా బోయపాటి డిజైన్ చేశారట.
సింహా, లెజెండ్ తర్వాత బాలయ్యతో చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా.. అఖండ మాత్రం అందర్నీ ఆకట్టుకుని మరో సంచలన విజయం సాధించడం ఖాయమని బోయపాటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు లో అఖండ సినిమాను విడుదల చేయనున్నారు.
Must Read ;- షాకింగ్ ధరకు.. బాలయ్య ‘అఖండ’ హిందీ డబ్బింగ్ రైట్స్