Mahesh Babu Responded About His Movie With Rajamouli :
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమధ్య మహేష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన సర్కారు వారి పాట టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగాయి. దీంతో అభిమానులు సర్కారు వారి సరికొత్త వార్తల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాహుబలితో చరిత్ర సృష్టించిన రాజమౌళితో మహేష్ సినిమా ఎప్పుడు ఉంటుంది అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ సస్పెన్స్ గా మారింది.
ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి బాలీవుడ్ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్టార్ హోటల్ లో తన ఫ్యాన్స్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుల గురించి ఓపెన్ గా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సర్కారు వారి పాట సినిమా గురించి అడిగితే.. సర్కారు వారి పాట సినిమా పోకిరిని మించి వుంటుందన్నారు. పూరి శిష్యుడిగా పరుశురామ్ అలాంటి సినిమా అందిస్తున్నాడని మహేష్ చెప్పారు. అంతే కాకుండా.. సింగిల్ టేక్ లో కథ ఓకె చేసాను చెప్పారు.
మరి.. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడిగితే… త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా తరువాత రాజమౌళితో సినిమా చేయబోతున్నాను అని క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు. రాజమౌళితో సినిమా అంటే రెండేళ్లు పడుతుంది. మూడేళ్లు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదైతేనే మొత్తానికి జక్కన్నతో సినిమా గురించి క్లారిటీ వచ్చేసింది. ఇక మహేష్ అభిమానులకు పండగే.
Must Read ;- బుల్లితెర పై ఎన్టీఆర్ తో కలిసి సందడి చేయనున్న మహేష్