సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం ఓ సినిమా చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఒక్క మహేష్ బాబు మాత్రమే కాకుండా.. నాగార్జున – మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ మూవీ చేయాలనుకున్నారు మణిరత్నం. నాగార్జున, మహేష్ బాబును కలిసి మణిరత్నం కథ చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం కావాలని అటు నాగార్జున అభిమానులు, ఇటు మహేష్ బాబు అబిమానులు కోరుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
ఇదిలా ఉంటే.. మణిరత్నం నిర్మించిన నవరస అంథాలజీ చిత్రం ఆగస్టు 6 న విడుదల కి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేయడం జరిగింది. అయితే.. నవరస చిత్రం ప్రమోషన్స్ లో భాగం గా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా పై ఆయన మాట్లాడారు. గతంలో మహేష్ తో సినిమా కోసం చర్చలు జరిపానని.. అయితే స్టొరీ సరిగ్గా రాకపోవడంతో సినిమా చేయలేదని అన్నారు. అయితే.. సరైన కథ దొరికినప్పుడు తప్పక మహేష్ బాబు తో కలిసి పని చేస్తానని అన్నారు.
అయితే మణిరత్నం చేసిన వ్యాఖ్యల పై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి.. భవిష్యత్ లో మహేష్ బాబు – మణిరత్నం కాంబినేషన్ లో మూవీ వస్తుందని ఆశిద్దాం.
Must Read ;- మహేష్ మరోసారి ఛాన్స్ ఇస్తాడా?











