మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతుంటే… నేనున్నాను అంటూ జీవిత రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం విశేషం. దీంతో ఈసారి ఎన్నికల్లో ఏం జరగనుందో అనేది ఆసక్తిగా మారింది. ప్రకాష్ రాజ్ ముందుగా చిరంజీవిని కలిసి ఆయన మద్దతు తీసుకుని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ గత మూడు నెలల నుంచి పక్కా ప్లాన్ రెడీ చేసుకుని రంగంలోకి దిగడానికి రెడీ అయ్యారు.
ఇక మంచు విష్ణు సీనియర్ హీరోలు కృష్ణ, కృష్ణంరాజు తదితరులను కలిసి వాళ్ల మద్దతుతో రంగంలోకి దిగబోతున్నారు. అయితే.. ఊహించని విధంగా తెర పైకి జీవిత వచ్చింది. దీంతో పాలిటికల్ ఎలక్షన్స్ తలపించేలా ఈ ఎన్నికలు ఉండడంతో కామన్ మేన్ లో సైతం క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే.. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు జీవిత ముందు ఓ ప్రపోజల్ పెట్టారట. అది ఏంటంటే.. జీవిత ప్రస్తుతం అసోసియేషన్ లో సెక్రటరీగా ఉన్నారు. రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.
తన ప్యానెల్ తరుపున సెక్రటరీగా పోటీ చేయమని.. వచ్చే ఎలక్షన్ లో అధ్యక్ష పదవికి పోటీ చేయమని.. తను పూర్తి సపోర్ట్ అందిస్తానని జీవితకు విష్ణు ఆఫర్ ఇచ్చాడట. జీవిత మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా ఏమీ చెప్పలేదట. మరి.. విష్ణు ఆఫర్ కి జీవిత ఎలా రియాక్ట్ అవుతుంది.? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది.? అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- ప్రకాష్ రాజ్, మంచు విష్ణులతో పోటీకి సై అంటున్న జీవితా రాజశేఖర్