ఈ విశాల విశ్వంలో బాహుబలి లాంటి పెద్ద సామాజ్రాలు ఉన్నాయి. కుంతల దేశం లాంటి చిన్న సామ్రాజ్యాలు కూడా ఉన్నాయి. ఒక్కో సామ్రాజ్యానిది ఒక్కో ప్రత్యేకత. దేనికదే విభిన్నం. సాధారణంగా మనకు అతి పెద్ద సామ్రాజ్యాలు అనగానే బ్రిటన్ తో పాటు మొఘలు సామ్రాజ్యాలు గుర్తుకొస్తాయి. కానీ పెద్ద పెద్ద సామ్రాజ్యాల మాటున చిన్నవి కనురుగైపోతున్నాయి. ఎన్నో వింతలు… విశేషాలు సైతం వెలుగులోకి రాకుండాపోతున్నాయి. కానీ ఈ చిన్న సామ్రాజ్యం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తోంది. దాని పేరే టవోలారా.. ప్రపంచంలోనే అతి చిన్న సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్న… ఈ ప్రదేశం గురించి తెలుసుకుంటే ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే..
ఒక్క రాజు.. 11 మంది మాత్రమే..
ఏ చిన్న రాజ్యం అయినా.. పెద్ద భవంతులు.. కోటలు.. పురాతన కట్టడాలు.. లెక్కకు మించి జనాలు కళ్ల ముందు కదలాడుతారు. ఈ టవోలారా రాజ్యంలో అలాంటివీ ఏమీ ఉండవు. ఒక్క రాజుతో పాటు 11 మంది జనాలు మాత్రమే ఉంటారు. ఆయన పేరు ఆంటోనియో బర్తలివోనీ. పర్యాటకులు ఎవరైనా ఆయనను గుర్తుపట్టడం చాలా కష్టమేనట. ఎందుకంటే ఆయన నిక్కరు వేసుకొని.. సాదాసీదా చెప్పులతో పడవ ప్రయాణం చేస్తుంటారు. ఆయన చక్రవర్తిలా అసలు ఫీల్ అవ్వరు. ఆయన దుస్తులు.. జీవిన శైలి వెరైటీ ఉంటుంది. ఆయన కు ఫుడ్ మాత్రమే ఫ్రీ గా దొరుకుతుంది. మిగతా వాటిని కష్టించి సంపాదించుకోవాల్సిందే. రాజుగారి కోసం ప్రత్యేకంగా ఓ రెస్టారెంట్ కూడా ఉందట.
ఎక్కడ ఉంది?
ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్ కు దగ్గరగా.. మధ్యధరా సముద్రంలో ఓ దీవి ఉంది. దాని పేరు టవోలారా. దీవి పేరు మీదనే టవోలారా ఏర్పడింది. ఇటీవలనే 180వ ఆవిర్భావ వేడుకలను కూడా జరుపుకుంది. ఆ దేశ చక్రవర్తి ముత్తాత ఇటలీ నుంచి పారిపోయి వచ్చాడట. ఆ తర్వాత కాలక్రమేణా చిన్న సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ చిన్న దీవి మీ రాజ్యామా.. అని ఎవరైనా పోరపాటున అంటే.. మాది పెద్ద దేశమే అని బదులిస్తారు అక్కడివాళ్లు. 19వ శతాబ్దంలో బ్రిటన్‌కు చెందిన క్వీన్ విక్టోరియా ప్రపంచ దేశాల చక్రవర్తుల ఫోటోలను సేకరించాలని ఆదేశించారు. అప్పుడు టవోలారా రాజ కుటుంబం ఫోటోలను కూడా తీసుకెళ్లారు. బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో ఆ ఫోటోలు ఇప్పటికీ కనిపిస్తుండటం విశేషం.
సాధారణ జీవితం
ఈ చిన్న రాజ్యం చుట్టూ చాలా సముద్ర జీవులు ఉన్నాయి. వాటిని చూసేందు ప్రపంచ నలుమూలాల నుంచి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. అప్పుడే రాజే.. స్వయంగా పడవ నడిపి తన సామ్రాజ్యాన్ని చూపిస్తారు. అతిథుల కోసం చేపల వంటకాలు సిద్ధం చేసి సర్వ్ చేస్తారు. రాజుగారి రెస్టారెంట్లో ఇష్టమైన వంటకాలు తిని, పర్యాటకులు అక్కడ రిలాక్స్ అవుతారు. ఈ దేశానికి పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతోంది. అయినా కూడా అక్కడివాళ్లు సాధారణ జీవితమే గడుపుతారు. అక్కడి రాజుగారు అయితే ఉదయాన్నే స్మశానానికి వెళ్తారట. అక్కడ భార్య సమాధి మీద పూలు పెట్టి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాతే రోజువారి జీవితం ప్రారంభిస్తారు.
Must Read ;- బాల బ్రహ్మం అభిజ్ఞ కరోనాపై ఏమంటున్నాడు?