సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కథానాయికల్లో ఒకరు అనుపమ పరమేశ్వరన్. అఆ, శతమానంభవతి, రాక్షసుడు తదితర చిత్రాలతో సక్సస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు కాస్త తగ్గినా తమిళ్, మలయాళ సినిమాల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే.. సినీ తారలు సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు మరింత చేరువగా ఉంటారు.
నిత్యం రకరకాల ఫోటోషూట్లతో.. సినిమా విశేషాలతో.. వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతే కాదు అప్పుడప్పుడూ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా లైవ్‌లో చిట్ చాట్ చేస్తుంటారు. అభిమానులు అడిగే ప్రేక్షలకు సమాధానం ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు హీరోయిన్స్‌ను ఇబ్బందికర ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితే అనుపమకు ఎదురైంది. ఇంతకీ విషయం ఏంటంటే.. అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది.
ఈ క్రమంలో అభిమానులు ఆమెను పలు రకాల ప్రశ్నలు అడిగారు.. మీ కొత్త సినిమాలు ఏంటి ..? ఏ హీరోతో కలిసి నటిస్తున్నారు.. ?ఇలాంటి ప్రశ్నలు అడిగారు. వాటికి అనుపమ ఓపికగా సమాధానాలు చెప్పింది. అయితే.. ఓ నెటిజన్ మాత్రం కాస్త హద్దుమీరి మీరు బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేయండి అని అడిగాడు ఓ నెటిజన్. దానికి అనుపమ స్పందిస్తూ.. నీ అడ్రస్ పంపించు.. నేను ఫోటో పంపిస్తా.. ఫ్రేమ్ కట్టించి పెట్టుకో.. అని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇక తెలుగులో సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ 18 పేజేస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తుంది. మరి.. ఈ రెండు సినిమాలతో అయినా అనుపమ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.
Must FRead ;- సమంత, చైతూల మధ్య మనస్పర్ధలా?











