సినిమా రంగ సమస్యపై ప్రభుత్వంతో చర్చించడానికి సినీ రంగ పెద్దలు ఎందుకు వెళ్లలేదు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అసలు ఈరోజు సమావేశం సీఎం జగన్మోహనరెడ్డితో జరగాల్సి ఉంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు లాంటి పెద్దలంతా హాజరుకావాల్సి ఉంది. ఏంజరిగిందో తెలియదుగానీ ఈ సినీ పెద్దలెవరూ సమావేశానికి వెళ్లలేదు. ప్రస్తుతం జరుగుతున్న సమాశానికి సీఎం జగన్మోహనరెడ్డి కూడా హాజరుకాలేదు. కేవలం ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆధ్వర్యంలోనే ఈ సమావేశం సాగింది.
కొందరు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్, నిర్మాత దానయ్య, రామసత్యనారాయణ, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం ప్రవేశం పెట్టబోతున్న ఆన్ లైన్ టిక్కెంటింగ్ పైనే చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వం సినిమా రంగ సంక్షేమం కన్నా ప్రజల పక్షానే నిలుస్తున్నట్టుగా మంత్రి మాటలు ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే చట్టాలకు అతీతంగా సినిమా వ్యాపారం సాగుతోందన్న అభిప్రాయం మంత్రి మాటల్లో వ్యక్తమైంది.
అయితే మెగాస్టార్ చిరంజీవి అంటే సీఎం జగన్ కు సదభిప్రాయం ఉందని కూడా మంత్రి చెప్పారు. నిన్న రాత్రి లవ్ స్టోరీ ఫంక్షన్ లో చిరంజీవి ప్రభుత్వానికి ఓ విన్పపం కూడా చేశారు. సినిమా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ పై ఎవరూ అభ్యంతరం చెప్పినట్లుగా లేదు. ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల రేట్ల గురించి వివరించినట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే అమలు చేయాలని అన్నారు.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొన్ని సూచనలు తీసుకున్నట్లు చెప్పారు. చాలా థియేటర్లు మూతపడుతున్న విషయాన్ని నిర్మాత ఆదిశేషగిరిరావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బెనిఫిట్ షోల కోసం ప్రత్యేకంగా కోరితే అనుమతి ఇస్తామని మంత్రి నుంచి వారికి హామీ లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని తామే అడిగినట్టు సినిమారంగ ప్రతినిధులు కూడా అంటున్నారు. వీరి కోరిక మేరకే ప్రభుత్వం ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ పెడుతున్నట్లు స్పష్టమవుతోంది.
Must Read ;- సినిమా టిక్కెట్లపై సర్కారు నిర్ణయం మంచికా చెడుకా?











