Prakash Raj About Pawan Kalyan Recent Speech At Republic Movie Pre Release Event :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవ్వడం తెలిసిందే. అటు రాజకీయ వర్గాల్లోను ఇటు సినీ వర్గాల్లోను దీని గురించే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు ఖండిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటుంది.? పవన్ కి సపోర్ట్ గా నిలుస్తారా..? ఏపీ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలుస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఈరోజు నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యల పై స్పందించారు.
ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే…ఈరోజు నామినేషన్స్ వేశాం. 900 మంది ఉన్న అసోసియేషన్ ఇది. అభివృద్ధి చేయడానికి మేము పోటీ చేస్తున్నాం. మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం అంటూ వార్తలు వస్తండడం గురించి విన్నాను కానీ.. ఎవరు చేస్తున్నారో తెలీదు. ఇవి రాజకీయ ఎన్నికలు కావు. ఇవి కేవలం సినిమా ఎలక్షన్స్. ఇక పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మాటల గురించి చర్చించుకుంటున్నారు. నా అభిప్రాయం ఏంటంటే.. ఆయన మాటల్లో ఆవేశం.. అర్థం.. రెండు ఉన్నాయి అన్నారు.
జీవితరాజశేఖర్ మాట్లాడుతూ…ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సింగిల్ ఫ్యామిలీ. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరిస్తే మంచిది. హెల్తీవే అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ తో ఎన్నికలు జరగాలి. నా పై కొన్ని విమర్శలు వచ్చాయి, అవి నన్ను బాధించాయి కానీ.. నేను ‘మా’ అభివృద్ధి కోసం పని చేసాను. గెలిచినా, ఓడినా అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసమే పని చేస్తారు. అందరూ సినిమాల్లోనే నటిస్తారు. అందరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా అభివృద్ధి కోసం ప్రకాష్ రాజ్ గారు గ్రౌండ్ వర్క్ చేసి ప్లాన్ రెడీ చేశారు. ప్రకాష్ రాజ్ గారి అలోచనలు బాగున్నాయి కాబట్టి మేము వారికి సపోర్ట్ చేస్తున్నాం అన్నారు.
Must Read ;- పవర్ స్టార్ వ్యాఖ్యలపై వాడివేడిగా ఎదురుదాడులు











