అన్నింటికీ వాళ్లే .. మరి మీరెందుకు??
ఏపీలో పాలన పెత్తనమంతా టూ, త్రీ లది అయితే.. ప్రతిపక్షాలకు కౌంటర్లు, ప్రభుత్వ విధానాలను తెలిపేందుకు మంత్రులు పేర్ని, కొడాలి, కన్నబాబు, బొత్స, పెద్దిరెడ్డి, అనిల్ కుమార్ వంటివారు అప్పుడప్పుడు మీడియా ఎదుట దర్శమిస్తూ మాట్లాడుతుంటారు. అయితే 20 మందికి పైగా ఉన్న జగన్ రెడ్డి కెబినెట్ లో ఆ ఆరుగురు తప్పా .. మిగతా వారందరూ ఏం అయిపోయినట్లు? వారి శాఖలపై విపక్షలు చేస్తున్న విమర్శలకు ఎందుకు బదులివ్వడం లేదు? అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అన్నీ ఆ నలుగురే చెప్పకుంటూపోతుంటే మరి.. అలకారంప్రాయంగా ఉన్న మీ పదవులేదుకు?, మీరు నోరు కట్టేసింది ఎవరు? లేకుంటే మీ నోరు కుట్టుకున్నారా? అని ప్రజలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వంగవీటి రాధాపై రెక్కీ, బీజేపీ ఎదురు దాడిపై మంత్రుల స్పందన కరువు?
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వంగవీటి రాధా హత్యకు కుట్రపై హోంశాఖ మంత్రి కనీసం లీడ్ తీసుకుని మాట్లాడలేని పరిస్థితి. కనీసం స్పందించి.. చర్యలు తీసుకుంటాం.. దర్యాప్తుకు ఆదేశించాం అని కూడా చెప్పలేకపోవడం పలు అనుమానాలు తావిస్తున్నారు. అలానే బీజేపీ ప్రజా ఆగ్రహ సభ ద్వారా ఆ పార్టీ నేతలు జగన్ రెడ్డిపై, మంత్రుల శాఖలపై దుమ్మెత్తిపోశారు. కానీ దీనిపై మౌనవత్రం పాటిస్తున్న ఆ మంత్రుల నుంచి నో వాయిస్! జిల్లా, నియోజకవర్గానికి పరిమితమై పెళ్లిలు, శుభాకార్యాలు, ప్రారంభోత్సవాలకే పరిమితమైన ఆ నిశ్శబ్ధ మంత్రులు.. రానున్న రోజుల్లో జగన్ మంత్రి వర్గ మలి దఫా విస్తరణలో ఊడి పదువుల్లో ముందు వరుసలో వీరే ఉంటారని అని కూడా టాక్స్ స్టేట్ లో షికారు చేస్తున్నాయి. అంతేకాక జగన్ రెడ్డి అధికారలోకి రాగానే మంత్రి రెండు దఫా మంత్రి వర్గ వస్తరణ రెండునరేళ్ల తరువాత తప్పక ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే మంత్రులు ఆళ్లనాని, పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్ రెడ్డి, నారాయణ స్వామి, శంకరనాయరాయణ వంటి తదితరులు మౌనవత్రం పాటిస్తున్నారు. త్వరలో జరగబోయే విస్తరణలో మాజీలు అయ్యే లిస్ట్ 14 మందికి పైగా ఉన్నట్లు అందుతున్న సమాచారం!
Must Read ;- వంగవీటి రాధా ఇంటి ముందు నిలిపిన స్కూటీ వారిదేనా?