విచిత్ర రాజకీయ సాంప్రదాయం!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజకీయాల్లో విచిత్ర సాంప్రదాయాలు వెలికిచూస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ లను బాగా బండబూతులు తిట్టిన మంత్రులకు, నాయకులు మంచి బహుమతులివ్వడం, ప్రశంసలు కురిపించడం జగన్ రెడ్డి ఆనవాయితీ! అలానే టీడీపీ నేతలను చంపుతాం.. పొడుస్తాం.. ఇంటిపైకి వెళ్లి దాడిచేస్తాం.. టీడీపీ కార్యాలయాలపై పడి ధ్వంసం చేస్తాం .. అన్నవారిని అందలం ఎక్కించి, పార్టీలో పదవులను అందిస్తారు. ఇటువంటి కుసంస్కారం దేశంలో ఎక్కడ చూడం! వంగవీటి రాధాను చంపితే తప్పేంటి అన్నవారికి పదవులు, మర్డర్ చేయడానికి రెక్కీ నిర్వహించే వారికి పార్టీలో ప్రాధన్యత కల్పించడం వంటివి ఏమిటి? అని తెదేపా నేత చినరాజప్ప జగన్ రెడ్డిని నిలదీశారు.
రాధాను చంపి.. కులాల మధ్య చిచ్చు పెట్టి..!?
రాధాను చంపి కులాల మధ్య చిచ్చుపెట్టి, రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం జగన్ చేస్తున్నారని చినరాజప్ప విమర్శించారు. రంగాను హత్యచేసిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ కు వైకాపాలో పెద్ద పీట వేశారని ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీ పాలన చూస్తుంటే విజయవాడ లో పాత రోజులు పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయని బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన రోజే .. వంగవీటి రాధా ఇంటిపై రెక్కీ నిర్వహించారని బుద్దా వివరించారు. నిజాలు తెలియాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Must Read ;- రాధా మర్డర్‌కు కుట్రలు..! వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే..!- చంద్రబాబు











