పోర్టుల అభివృద్ధికి ఇక జరిగేనా?
పోర్టుల అభివృద్ధి చేయాల్సిన నిధులను జగన్ రెడ్డి పక్కదారిపట్టించారు. మారీటైమ్ బోర్డు ఆదాయాన్ని పోర్టుల అభివృద్ధికే వినియోగించాల్సి ఉండగా.. వాటిని కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ మారీటైమ్ బోర్డు నుంచి రూ. 1200 కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించిన విషయం అక్షర సత్యమని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. పోర్టుల ద్వారా ఏటా రూ.250 కోట్ల మేరకు ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో గడిచిన రెండేళ్ల కాలంలో రూ. 600 కోట్లు, గంగవరం పోర్టుని విక్రయించగా వచ్చిన మరో రూ.600 కోట్లు కలిపి మొత్తం రూ. 1200 కోట్లను కాజేసి బోర్డును దివాలా తీయించే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు.
తూర్పు తీర ప్రాంతానికి సింహ ద్వారం గంగవరం పోర్టు..!
తూర్పు తీర ప్రాంతానికి సింహ ద్వారం, సింహభాగం ఆదాయాన్ని అందించే పోర్టు గంగవరం. విశాఖపట్నం లోని ఈ గంగవరం పోర్ట్ గత దశాబ్ధకాలంలో దేశానికి తూర్పు తీరంలో ఉన్న పోర్టుల్లో అతి ముఖ్యమైన పోర్టుగా ఎదిగింది. 2019-21 ఆర్థిక సంవత్సరానికి ఈ పోర్టు నుంచి 32.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదు చేసింది. తద్వారా రూ. 1,057 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇంత సామర్థ్యం ఉన్న గంగవరం పోర్టును జగన్ రెడ్డి తెగనమ్మారు. దీనిని రహస్యంగా అమ్మి .. చేతులు దులుపుకున్నారు. కానీ తెలుగుదేశం ఈ విషయాన్ని సాక్ష్యాధారలతో బయటపెట్టింది. దీనిపై వైసీపీ మంత్రులు, పెద్దలు సమాధానం చెప్పలేక మోహం చాటేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే వివిధ పోర్టుల అభివృద్ధికి టెండర్లు కూడా కాంట్రాక్టర్లు రావట్లేదని విమర్శించారు. మారీటైమ్ బోర్డు ఆడిట్ రిపోర్టును శాసనసభలో ఉంచాలన్న నిబంధను కూడా ఉల్లంఘించి, ఇంతవరకూ చట్ట సభల ముందుకు రిపోర్టును తీసుకురాకపోవడానికి కారణంగా అవినీతేనని ఆయన దుయ్యబట్టారు.
Must Read ;- సీఎం జగన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం..!











