శ్రీకాంత్ నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల లక్ష్మీ రాయ్. కథానాయికగా తొలి ప్రయత్నం ఫలించకపోయినా.. తదుపరి అవకాశాల్ని బాగానే అందుకుంది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమెకు ఇక్కడ అంతగా గుర్తింపు రాలేదు. తమిళ, కన్నడ పరిశ్రమలోనూ అవకాశాలు అంతంత మాత్రమే అయ్యాయి. దాంతో బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ రాయ్ లక్ష్మిగా పేరు మార్చుకొని నటించిన ‘జూలీ 2’ అంతగా ఆడకపోవడంతో.. అమ్మడు తెలుగులో ఐటెమ్ గాళ్ గా అవతారమెత్తింది.
మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీనెం. 150’ లో రత్తాలు రత్తాలు అంటూ ఆమె వేసిన చిందులకు మెగా ఫ్యాన్స్ చిత్తైపోయారు. అలాగే.. పవర్ స్టార్ సర్ధార్ గబ్బర్ సింగ్ లో తోబ తోబా అంటూ ఆడిపాడింది. అంతకు ముందే రవితేజ ‘బలుపు’ మూవీలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చింది.
ప్రస్తుతం రాయ్ లక్ష్మి చేతిలో రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు, ఒక కన్నడ, ఒక మలయాళ సినిమాలున్నాయి. తెలుగులో అంతగా అవకాశాలు లేకపోయినా.. తమిళంలో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది రాయ్ లక్ష్మి. ఇక రాయ్ లక్ష్మి తన ఎంగేజ్ మెంట్ తేదీ ఫిక్సయిందని ప్రకటించింది. ఈ నెల 27న ఆమె ఎంగేజ్ మెంటట. అయితే అమ్మడు తన జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు వెల్లడించనని ..అతడ్ని డైరెక్ట్ గా పెళ్ళికే చూడండంటూ.. చెబుతోంది. ఆమెను పెళ్ళి చేసుకోబోయే యువకుడు ఎలా ఉంటాడో చూడాలి.
ALSO READ :తెలుగులో మళ్లీ ఐటెమ్ సాంగ్ కు రత్తాలు రెడీ .. !