రవితేజ కెరీర్ బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే.. అందులో ‘భద్ర’ సినిమాకి ప్రత్యేక స్థానముంటుంది. 2005 లో బోయపాటి శ్రీను డెబ్యూ మూవీగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత బోయపాటి దర్శకుడిగా చాలా బిజీ అయిపోయాడు. రవితేజ సైతం ‘భద్ర’ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ వీరి సూపర్ కాంబో లో మరో సినిమా ఇంతవరకూ రాలేదు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం నటసింహ బాలకృష్ణతో సినిమా చేస్తోన్న బోయపాటి.. దీని తర్వాత సినిమా రవితేజ తోనే చేయబోతున్నాడని సమాచారం. రవితేజ కోసం ఓ సూపర్ స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నాడట బోయపాటి. రవితేజ కు కథాంశం బాగా నచ్చి.. సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. రవితేజ స్టైల్లో .. యాక్షన్ కామెడీగా ఈ సినిమా ఉండబోతోందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నక్కిన త్రినాథరావు మూవీ కి రెడీ అవుతాడు. ఈ సినిమా సెట్స్ మీదుండగానే.. బోయపాటి సినిమా కూడా లైన్ లోకి వస్తుందని సమాచారం. మరి రవితేజ కోసం ఈ సారి బోయపాటి ఏ తరహా కథను ఎన్నుకుంటాడో చూడాలి.
Must Read ;- మాస్ మహారాజ్ సరసన అందాల జాతిరత్నం?