‘ఈ పాదం నటరాజ కీర్తగానం..’ అంటూ ‘మయూరి’ మూవీలోని తన నాట్య ప్రతిభతో తెలుగువారిని మంత్ర ముగ్ధుల్ని చేసింది సుధా చంద్రన్. భారతీయ నృత్యంలో విశేషమైన ప్రతిభను ప్రదర్శించిన ఆమె .. యాక్సిడెంట్ లో ఒక కాలును కోల్పోయి.. జయపూర్ ఫుట్ అమర్చుకుని.. దాంతోనే నాట్యంలో సాధన చేసి నాట్య మయూరి అనిపించుకున్నారు. ఆమె జీవిత కథతోనే తెలుగులో ‘మయూరి’ అనే సినిమా తెరకెక్కించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆ సినిమాలో ఆమె నాట్యం చేస్తుంటే.. ఆమెది కృత్రిమ కాలు అని ఎవరూ అనుకోరు. అంతలా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. నాట్యంలో సాధన చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సుధా చంద్రన్ ను లెజెండ్ అవార్డ్ వరించింది.

ఎన్నో టీవీ సీరియల్స్ లో సైతం సుధాచంద్రన్ నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో సైతం సుధాచంద్రన్ నటించి నటన పరంగానూ తమ ప్రతిభ చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వి.బి. ఎంటర్ టైన్ మెంట్స్ బుల్లితెర అవార్డు 2020 ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. డిసెంబర్ 27న హైదరాబాద్ లోని శిల్పారామం రాక్ హైట్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. నటి సుధాచంద్రన్ ను ఈ వేదిక మీద లెజెండ్ అవార్డు తో సత్కరించారు. ఇక ఈ అవార్డు ను జీవితా రాజశేఖర్, బాబూ మోహన్, శివాజీరాజా, అంబిక కృష్ణ లు సుధా చంద్రన్ కు అందజేశారు.
Must Read ;- మూగ జీవాలకు తన వంతు సహాయం చేస్తానంటున్న యాంకర్ రష్మి











