మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి చాలా సినిమాల్లో సామాన్య వ్యక్తిగానే కనిపిస్తూ ఉంటారు. ఆయన ధనవంతుడిగా ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్టు గా సినిమాల్లో చూపించడం చాలా తక్కువ. అయితే ఆయన దగ్గర దిమ్మతిరిగే కార్ల కలెక్షన్ ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మమ్ముట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను కొని తన గ్యారేజ్ లో పెడుతుంటారు . జాతీయ అవార్డు గ్రహిత అయిన ఆయన తన గ్యారేజీలో కొన్ని అరుదైన కార్లను తన కలెక్షన్ కు జోడించారు.
పోర్షే పానమేర టర్బో
ఈ కారును ఎంతో ఇష్టపడి దుల్కర్ సల్మాన్ కొన్నాడు. అయినప్పటికీ మమ్ముట్టి యే వాడుతుంటారు. మమ్ముట్టి ఈ కారులో షికార్లు తిరిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ కారు ఇండియా పానమేర వెర్షన్. ఒకసారి మమ్ముట్టి అమ్మ అసోసియేషన్ మీటింగ్ కు ఈ కారులోనే వచ్చారు.
పోర్స్చే కయెన్నే ఎస్
ఈ కారు పోర్షే కంపెనీకి చెందిన మరో కారు. ఎక్కువ సార్లు మమ్ముట్టి ఇదే వాహనాన్ని వాడుతూ కనిపించారు. ఈ కారు ఆయన నటించిన అనేక సినిమాల్లో కూడా కనిపించింది.
Also Read ;- చై సామ్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఎన్నున్నాయో తెలుసా?
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
ల్యాండ్ రోవర్ 2020 లేటెస్ట్ మోడల్ కారు. ఇది మలయాళం సినిమా ఇండస్ట్రీలో మమ్ముట్టి దగ్గర మాత్రమే ఉంది. కానీ ఆయన ఈ కారును ఎక్కువగా వాడుతున్నట్లు కనిపించలేదు.
బెంజ్ ఎస్ఎల్ ఎస్ఏ
ఈ కారు అత్యంత వేగవంతమైన కార్ల జాబితాలో ఉంది. దీనిని ఎక్కువగా మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ వాడుతుంటారు. బెంజ్ కంపెనీకి చెందిన ఈ కారు అనేక సార్లు కొచ్చి రోడ్లపై దూసుకుపోయింది.
Must Read ;- అన్ లాక్ లో 46రోజుల్లోనే పూర్తయిన మలయాళ సినిమా
బీఏండబ్ల్యూ
నీలి రంగు బీఏండబ్ల్యూ కారులో ఎక్కువగా ముమ్ముట్టి షూటింగులకు వెళుతుంటారు. కొన్ని సినిమాల్లో బీఏండబ్ల్యూ కారును కూడా వాడారు మమ్ముట్టి. ఆయనకు ఈ కారు చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు.