మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రత్యేకంగా వేసిన ఓ సెట్లో ప్రస్తుతం తండ్రీ కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని, ఎమోషనల్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సీన్స్ .. సినిమాకి బ్యాక్ బోన్ కానున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయట. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఆ లొకేషన్ కి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇంతకు ముందు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ జరుపుకుంది ఇదే లొకేషన్ లో. ఇప్పుడు అక్కడే చిత్రీకరణ జరుపుకుంటోన్న ఆచార్య కు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన షాట్ గ్యాప్ లో చిరు, చరణ్ ఒకే ఫ్రేమ్ లో వైట్ షర్ట్ , బ్లాక్ ప్యాంట్స్ ధరించి.. అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇందులో వీరిద్దరి ఫోటోస్ ను ఎవరో సెల్ ఫోన్ లో బంధిస్తుంటే.. చరణ్ వద్దని వారిన్తున్నట్టు గా కనిపిస్తోంది. మే 13న విడుదలకు సిద్ధమవుతోన్న ఆచార్య సినిమా.. టీజర్ తో రెట్టింపు అంచనాలు రేకెత్తించింది. దాంతో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరే ఫిగర్స్ తో కంప్లీట్ అయింది. మరి ఆచార్య తో చిరు మెగా హిట్టు అందుకుంటారేమో చూడాలి.
Must Read ;- ఆచార్య ను ఎదుర్కొనే పవర్ఫుల్ విలన్ ఇతగాడే!











