Mike Tyson Role In Vijay Devarakonda’s Liger Movie Has Raised Expectations For The Film :
విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని విజయ్ లుక్‌కు ఆమధ్య రిలీజ్ చేశారు. విజయ్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో లైగర్ పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ నెలలో ఈ సినిమా విడుదల కావాలి కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెలలో లైగర్ రావడం లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. లైగర్‌లో లెజెండరి మాజీ ఆటగాడు, బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కెన ఈ చిత్రంలో మైక్ టైసన్ క్లైమాక్స్ యాక్షన్ సీన్‌లో అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నారని ప్రకటించిన సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్, బాక్సింగ్‌లో లెజెండ్ మైక్ టైసన్ గారిని లైగర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో జర్నీ ప్రారంభించబోతున్నాం. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్ల్లానెట్, బాక్సింగ్ గాడ్, ది లెజెండ్, ది బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఐరన్ మైక్ టైసన్ అని అన్నారు.
ప్రస్తుతం లైగర్ మూవీ గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ పై క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని.. ప్రేక్షకులకు ఓ కొత్త తరహా చిత్రం చూసిన అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. మైక్ టైసన్ ఎంట్రీతో అంచనాలు అమాంతం పెంచేశారు పూరి. మరి..
లైగర్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- విజయ్ ప్లేస్ లో నాగచైతన్య. ఇది నిజమేనా?











