మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సాక్షిగా నెల్లూరు వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి అనిల్ యాదవ్ చిట్టమూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలకు వెయ్యి మంది కూడా హాజరుకాకపోవడంతో మంత్రి అనిల్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ యాదవ్ వెళ్లిపోగానే చిట్టమూరులో వైసీపీ శ్రేణులు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి. దీంతో నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి.
ఇక వరగలి క్రాస్ రోడ్డు నుంచి మోమిడి వరకు వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో కలసి రోడ్ షో నిర్వహించారు. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, వరప్రసాద్ రావు ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు గట్టిగా వంద మంది కూడా వైసీపీ కార్యకర్తలు రాకపోవడంతో మంత్రి అనిల్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Must Read ;- టీడీపీ స్మార్ట్ వర్క్..హార్డ్ వర్క్ @తిరుపతి