సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి పద్మావతి, గల్లా జయదేవ్ దంపతుల కుమారుడు అశోక్ గల్లా .. హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యే తరుణం ఆసన్నమైంది. నేడు అశోక్ పుట్టిన రోజు సందర్బంగా.. తల్లి పద్మావతి నిర్మాతగా .. సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. అమరరాజాఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై . ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. ఈ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందే ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. భలే మంచిరోజు, శమంతకమణి, దేవదాస్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేయడం విశేషాన్ని సంతరించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు మేకర్స్.
నిజానికి అశోక్ గల్లా .. తాతయ్య కృష్ణ దర్శకత్వంలో ఇరవై ఏళ్ళ క్రితమే టాలీవుడ్ కి బాలనటుడిగా పరిచయం అయ్యాడు. సినిమా పేరు ‘పండంటి సంసారం’. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. అందులో అశోక్ చాలా చెలాకీ గా నటించాడు. ఇప్పుడు హీరో అయ్యాకా కూడా తాతయ్య ఆశీర్వాదంతో .. ఆయన సమర్ఫణలో రూపొందుతున్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. అశోక్ ను ఎప్పటి నుంచో హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు. అయితే అది ఇప్పుడు నెరవేరుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో .. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి అశోక్ .. హీరోగా.. మేనమామకు తగ్గ మేనల్లుడు అని పించుకుంటాడేమో చూడాలి.
Must Read ;- మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?
Happy Birthday to Upcoming Young Hero @AshokGalla_ Best Wishes For A Bright Career
A @SriramAdittya film
Produced by Padmavathi Galla @amararajaent@AgerwalNidhhi @IamJagguBhai @JayGalla #SameerReddy @RIP_apart @GhibranOfficial pic.twitter.com/N8uegxpwMf— BA Raju's Team (@baraju_SuperHit) April 5, 2021











