మలయాళ కాప్ మూవీస్ కు బోలెడంత మంది అభిమానులున్నారు. ఒకప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ వేషాలకు సురేశ్ గోపీ బ్రాండ్ అంబాసిడర్ అనేంతగా సినిమాలు చేశారు. అయితే అదే టైమ్ లో మమ్ముట్టి , మోహన్ లాల్ సైతం పోలీస్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక ఈ జెనరేషన్ లో ఇప్పుడు యంగ్ హీరోలు పోలీస్ వేషాలతో చెలరేగుతున్నారు. నివీన్ పాలి, ఫహద్ ఫాజిల్, టోవినో థామస్, ఉన్ని ముకుందన్ లాంటి లీడింగ్ యంగ్ హీరోలు మాలీవుడ్ లో పోలీస్ వేషాలతో మెప్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సైతం పోలీసాఫీసర్ గా యూనిఫామ్ తొడుగుతున్నాడు. సినిమా పేరు ‘సాల్యూట్’.
మాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్న రోషన్ ఆండ్రూస్ ‘సాల్యూట్’ సినిమాకి దర్శకుడు. ఒక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాల్యూట్ సినిమా సాగుతుంది. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ నటిస్తోంది. బాబీ సంజయ్ స్ర్కిప్ట్ అందిస్తున్న ఈ సినిమా వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. నిజానికి దుల్కర్ సల్మాన్ కు ఇదే ఫస్ట్ పోలీస్ మూవీ కాదు. ఇంతకు ముందు విక్రమాదిత్యన్ అనే సూపర్ హిట్ మూవీలోనూ పోలీస్ గా నటించాడు. కాకపోతే.. అందులో ఖాకీ యూనిఫామ్ తో కనిపించడు. మరి ‘సాల్యూట్’ సినిమా దుల్కర్ కు ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Must Read ;- దుల్కర్ సల్మాన్ సరసన అందాల రాశి.. నిజమేనా?










