గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం ఘనమైన నివాళి అర్పించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టింది. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
బాలసుబ్రహ్మణ్యం నెల్లూరుకు చెందిన వాడే. ఆయన బాల్యం మొత్తం నెల్లూరు, శ్రీకాళహస్తిలోనే గడిచింది. నెల్లూరులోనే ఆయన బాల్యం నాటి ఇల్లు కూడా ఉండేది. ఇటీవలి కాలంలోనే.. బాలు.. తన సొంత ఇంటిని.. కంచి పీఠం వారికి కానుకగా ఇచ్చేశారు. నెల్లూరు జిల్లాతోను, ప్రత్యేకించి నెల్లూరు టౌన్ తోను బాలూకు ఎనలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి గుర్తుగా జగన్ సర్కారు ఆయన పేరును సంగీత కళాశాలకు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
Recognising the legendary singer #SPBalu 🎶, our Govt has decided to rename the Government School of Music & Dance in Nellore as “Dr. S P Balasubramanyam Government School of Music & Dance” pic.twitter.com/Icu3BT1CMa
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) November 26, 2020
Must Read ;- యస్పీ బాలు పేరుతో డబ్బింగ్ స్టూడియో ప్రారంభం