కొవిడ్ -19 వ్యాక్సిన్ల తయారీలో ముందున్న భారత్ బయోటెక్‌ను శనివారం ప్రధాని సందర్శించనున్నారు. ఇంతకీ భారత్ బయోటెక్ ఎక్కడుంది.. ఆ సంస్థ ఏర్పాటుకు కారణం ఏంటనే విషయంలోకి వెళ్తే. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. అందులో ఒకరు బీఎస్ బజాజ్ కాగా.. మరో వ్యక్తి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. అప్పట్లో దేశంలో మొట్టమొదటి జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన ప్రభుత్వాల హయాంలో విస్తరణ జరిగింది. ఆరోజు చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించి ఉంటే.. ఈ కంపెనీలను తమవైపు తిప్పుకునేందుకు చెన్నై, బెంగళూరు, గుజరాత్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే కొన్ని కంపెనీల సీఈఓలతో పక్కా కార్యాచరణ రూపొందించిన చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం వెంటనే భూ కేటాయింపు, ఒప్పందాలపై సంతకాలు పూర్తిచేయడం జరిగిందని. ఇది అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం వ్యాక్సిన్స్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్లో మూడోవంతు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉత్పత్తి అవుతన్నాయంటే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 200 ప్రధాన ఫార్మాస్యూటికల్ హబ్బుల్లో 10,000 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. 600వరకు కంపెనీలు సేవలందిస్తున్నాయి. అంతకుముందు ఈ విభాగంలో ముందంజలో ఉన్న చెన్నై, బెంగళూరు నగరాలను అదిగమించిన హైదరాబాద్ లోని ఔషధ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.
తాజాగా జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ లో తయారు అవుతున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రగతిపై సమీక్షించేందుకు ఆ కేంద్రాన్ని మోదీ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భారత్ బయోటెక్ కంపెనీకి అభినందనలు తెలిపారు. తాను సీఎంగా ఉన్న సమయంలో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు కావడం, అప్పుడు ఏర్పాటుచేసిన కంపెనీ లో ఈ వ్యాక్సిన్ తయారు కావడం ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఈ జీనోమ్ వ్యాలీ ఆసియాలోనే నెం.1గా ఉందని వాళ్ళు తనతో చెప్పారని.. అదెంతో సంతృప్తినిచ్చిందని మాత్రమే చంద్రబాబు అన్నారు.
ఆ మధ్య కేటీఆర్ అసెంబ్లీలో హైదరాబాద్ ప్రగతిపై మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు ఏర్పాటుచేసిందేనని వ్యాఖ్యానించారు. తరవాత వచ్చిన వైఎస్ దాన్ని కొనసాగించారు. గూగుల్ లో సెర్చ్ చేసినా.. ఈ జీనోమ్ వ్యాలీ ఏర్పాటైంది చంద్రబాబు హయాంలోనే అని చూపుతోంది కూడా.
Must Read ;- కరోనా టీకా ఫైనల్ పరీక్షలు.. గుంటూరులో
తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం..
హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ కొత్త వ్యాక్సిన్ల తయారీతోపాటు లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపుతోంది. అంతర్జాతీయ ఖ్యాతి కూడా సంపాదించి పెట్టింది. మొన్న ఫిబ్రవరిలో జరిగిన బయో ఏషియా సదస్సులో కూడా హైదరాబాద్ కీర్తి రెపరెపలాంటింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ మోడరేటర్ గా కూడా వ్యవహరించారు. ఈ సందర్భంగా జీనోమ్ వ్యాలీ విస్తరణకు ఉన్న ప్రణాళికలను వివరించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ క్లస్టర్ 1, 2కలిపి ఉన్న ఈ ప్రాంతంలో 800 కంపెనీలతో ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉందని.. వచ్చే పదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేటీఆర్ ప్రకటించారంటే.. జీనోమ్ వ్యాలీ విలువ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఒక్క ఔషధ తయారీ రంగం ద్వారానే నాలుగు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడం సాధ్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు
35శాతం వాటా..
జీనోమ్ వ్యాలీ దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం, అంతర్జాతీయ వ్యాక్సీన్ల తయారీలో 33 శాతం ఇక్కడినుంచి వెళ్లేవే. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. రానున్న కాలంలో ఇక్కడే ఒక వ్యాక్సీన్ ఇన్‌క్యుబేటర్‌ను ప్రారంభించే ఆలోచన ఉందని కేటీఆర్ అప్పట్లోనే ప్రకటించారు
బీఎస్ బజాజ్‌కు నివాళి..
హైదరాబాద్‌లో బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడిన బీఎస్ బజాజ్, జీనోమ్ వ్యాలీ, బయో ఆసియా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కేసీఆర్ కీర్తించారు. కాగా బీఎస్ బజాజ్ ఈ ఏడాది జులైలో కన్ను మూశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ సమాఖ్యకు ఆయన వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారని, 2019లో జరిగిన బయో ఆసియా సదస్సులో ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా ఇచ్చామని సిఎం కెసిఆర్ ప్రకటించారంటే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలున్నాయి.
Also Read ;- అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్