నగరి వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులు ఉన్నారంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆమె నగరిలో ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూనే మీడియా ముందుకు వచ్చి తమ రక్తంలోనే వైసీపీ ఉందంటూ ఫోజులు కొడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించే రోజా ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
రెబెల్స్‌ను రంగంలోకి దింపారంటూ..
వైసీపీకి వ్యతిరేకంగా కొందరు రెబెల్స్‌ను రంగంలోకి దింపారని నగరిలో ఓటు వేసిన అనంతరం రోజా వ్యాఖ్యానించారు. రెబెల్స్ విషయాన్ని త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతానని ఆమె చెప్పారు. స్థానిక సంస్థల మాదిరిగానే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని రోజా కొనియాడారు. కొంత కాలంగా ఆమె మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి తనకు తెలియకుండా కొందరి వైసీపీ నేతలను ప్రోత్సహిస్తున్నారని రోజా గుర్రుగా ఉన్నారు.
Must Read ;- విశాఖ స్టీల్, పోలవరంపై సెల్ప్ గోల్.. వైసీపీ పవర్ ఫుల్ డ్రామా