విలక్షణ నటుడు మోహన్ బాబు .. ఎర్లియర్ గా ‘గాయత్రి’, సూర్య ‘ఆకాశం నీహద్దురా’ సినిమాల్లో కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘సన్నాఫ్ ఇండియా’ అనే సినిమాతో వైవిధ్యంగా రాబోతున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మోహన్ బాబు స్ర్కీన్ ప్లే సమకూర్చడం విశేషం. 24 ఫ్రేమ్స్, లక్ష్మీ ప్రసన్నా పిక్చర్స్ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తమిళ హీరో సూర్య లాంఛ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. వివిధ గెటప్స్ లో మోహన్ బాబు రివీల్ అవగా.. మన అంచనాలకు అందని వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సెపరేటు. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో , ఎక్కడ ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. అంటూ మోహన్ బాబు పాత్ర స్వభావాన్ని తెలియచేశారు. ఇందులో మోహన్ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అర్ధమవుతోంది.
నేను చీకట్లో ఉండే వెలుతురు ను.. వెలుతురులో ఉండే చీకటిని అంటూ మోహన్ బాబు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక మోహన్ బాబు క్రియేట్ చేసిన ఫసక్ అనే డైలాగ్ కూడా ఇందులో బాగా పేలింది. టీజర్ చివరలో నేను కసక్ అంటే.. మీరందరూ ఫసక్ అని డైలాగ్ బాగా పేలింది. శ్రీకాంత్, ప్రగ్యా జైస్వల్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Must Read ;- మంచు విష్ణు దృష్టిలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ వీరే.. !