నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది అనేది పెద్దల మాట. కానీ ఇదే మాటను ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లను అడిగితే.. ‘నోరు మంచిదైతే.. కరోనా పరార్’ అని అంటారేమో.. నోటి శుభ్రత పాటించకపోతే, ఇన్ఫెక్షన్లు సోకి, తద్వారా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చిగుళ్ల వ్యాధికి, శ్వాసకోశ వ్యాధులకు సంబంధం ఉందని పలు హెల్త్ సర్వేలు చెప్తున్నాయి. నోరు శుభ్రతంగా ఉంటే కోవిడ్
వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది అని తేలింది. నోటి శుభ్రత, దంతాల రక్షణ లేనికారణంగా, కరోనా వైరస్ వ్యాప్తి చెంది చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించాయి. అందుకే నోటిశుభ్రత కూడా ముఖ్యమే అని చెప్తున్నాయి.
ఈ కోవిడ్ సమయంలో దంతాల పరిశుభ్రత పట్ల మరింత శ్రద్ధ అవసరం. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో.. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. అందుకే రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి నిద్రపోవడానికి ముందు దంతాలను శుభ్రపరుచుకుంటే మంచిది. సాఫ్ట్ గా ఉండే టూత్ బ్రెష్‌ను ఉపయోగించడం వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్ దెబ్బతినకుండా ఉంటుంది. నాలుక పరిశుభ్రంగా లేకపోతే నోటి దుర్వాసన మాత్రమే కాదు, మరెన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి బ్రష్ చేసిన ప్రతిసారీ నాలుకను కూడా క్లీన్ చేసుకోవాలి. కేవలం నోటికే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి నీరు ఎంతో మేలు చేస్తుందట. కాబట్టి వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రతిరోజు నోటి శుభ్రత కూడా అవసరమే.
Must Read ;- టాయిలెట్ తో కరోనా వైరస్ వ్యాప్తిస్తుందా..? ఎంతవరకు నిజం!











