ఆంధ్రప్రదేశ్.. అనంతపూర్ జిల్లా కదిరి.. ఉదయం 7 గంటలు కావస్తోంది. ఓ యువకుడు రంగుల డబ్బాలు, పెయింట్ బ్రష్ లు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు. ఊరి నడిబొడ్డున ఓ గోడ దగ్గర ఆగిపోయాడు. వెంటనే బ్రష్ లు తీసి చకచక పెయింట్సింగ్ వేశాడు. కరోనా విరుచుకుపడుతుండటంతో గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు మాస్కుల ధరించే ఆవశ్యకతపై చక్కని పెయింటింగ్స్ వేశారు. ఊళ్లో ఏ ప్రధాన వీధికి వెళ్లినా కరోనా చిత్రాలే కనిపిస్తున్నాయి.

చక్కని చిత్రాలు గీస్తూ.. కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఈ యువకుడి పేరు సోమశేఖర్. ఊరు ఏపీలోని గుడివాడ. లాక్ డౌన్ వల్ల కాలేజీ బంద్ ఉండటంతో.. ప్రజలకు ఏదైనా చేయాలని భావించి కరోనాపై అవగాహన కలిగే చిత్రాలు గీస్తున్నాడు. గ్రామీణుల్లో మార్పు తీసుకొచ్చాడు. అప్పటివరకు మాస్క్ లు, శానిటైజేషన్ అంటే తెలియనివాళ్లు కూడా మాస్కులు ధరిస్తూ, చేతులను శానిటైజ్ చేసుకోవడం మొదలుపెట్టారు.

సోమశేఖర్ ఇప్పటివరకు 50 గ్రామాలు తిరిగి ఎంతో మంది ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించాడు. శేఖర్ వేసిన కరోనా చిత్రాలు ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. పోలీసులు, అధికారులు శేఖర్ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. పోలీసులు కూడా లాక్ డౌన్ నుంచి శేఖర్ కు మినహాయింపు ఇవ్వడం విశేషం.
Must Read ;- కరోనా మందు 2-DG ధర ఖరారు











