తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూనే ఉన్నారు.ఆదివారం కూడ తెలంగాణలో వ్యాక్సినేషన్‌పై కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేత కాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత కండ్ల పరిపాలన..?’’
‘‘తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెల రోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్.ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి.’’ అని వైఎస్ షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. షర్మిల సీఎం కేసీఆర్ టార్గట్ చేసుకుని ఇంతగా విమర్శలు చేస్తున్నా టీఆర్ ఎస్ శ్రేణులు ఎవరూ స్పందించక పోవడం విశేషం.
Must Read ;- షర్మిల పార్టీ YSRTP.. కాని ఎన్నో సందేహాలు
తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. (2/2)
— YS Sharmila (@realyssharmila) June 6, 2021











