విజయసాయిపై రఘురామ ఫైర్..
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ రాజీనామా చేస్తున్నట్లు ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ఇస్తున్న సంకేతాలను చూసి అధికారపార్టీ నేతలకు కంటిమీద కునుకుపట్టడంలేదనుకుంటా? అందుకే పరస్పర ట్విట్టర్లో తిట్టు మొదలుపెట్టారు. గత పక్షం రోజులుగా విజయసాయి, రఘురామలు ట్విట్టర్ వేదికగా తిట్టిపోసుకుంటున్నారు. తనతో తిట్టించుకుంటే విజయసాయికి మరోసారి రాజ్యసభ వస్తోందని అనుకుంటున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి బయపడి కొంతమంది రాజీనామా చేస్తుంటే.. విజయసాయి మాత్రం బ్రతుకు తెరువుకు కోసం వాగుతున్నారని విమర్శించారు.
11న రాజీనామా..
అధికార పార్టీ అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ రఘురామ గత కొన్ని నెలలుగా పార్టీ అధినేత జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ వచ్చాడు. అయితే పోయిన నెలలో ఎంపీ వైసీపీకి డెడ్ లైన్ విధించాడు. తనపై అనర్హత వేటు వేయించలేనని చెపితే ఏం చేస్తానో చేప్తానని మంగళవారం విజయసాయిని ట్విట్టర్ వేదికగా రఘురామ నిలదీశాడు. ఏక చిత్ర నటుడు మాదిరిగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు విమర్శించారు. 11వ తేదీ వరకు టైం ఇస్తున్నాను.. ఏం చేసుకుంటావో చేసుకో విజయసాయిరెడ్డి అంటూ సవాలు విసిరారు. రాజీనామతో మీకు బుద్ధి చెప్పడానికి వస్తున్నాను, ప్రత్యేక హోదా అంటే మహిళ కమిషన్ సభ్యత్వం అంత ఈజీ అనుకున్నవా? అని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.
Must Read:-జగన్ రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు రోడ్డెక్కిన గురువులు! ఉద్యమించిన ప్యాఫ్టో!!











