చెన్నై సూపర్ కింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అందరి మనసుల్లో తిరుగులేని ముద్ర వేసుకుంది. 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పొలార్డ్ (87) రెచ్చిపోవడంతో ముంబయికి విజయం తేలికైంది.
ముంబయి అదుర్స్..
చెన్నై విధించిన భారీ లక్ష్య ఛేదనను ముంబయి ఏమాత్రం తడబడకుండా ఛేదించింది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో విజయం సాధించేందుకు ఆదినుంచే బాటలు వేసుకుంది. మొదటి వికెట్‌కు 71 పరుగులు జోడించారు ఓపెనర్లు రోహిత్-డికాక్. వారి తర్వాతే.. సూర్యకుమార్ (3), డికాక్ (38) పెవిలియన్ చేరారు.దీంతో గెలుపు కష్టంగానే అనిపించింది. కానీ పొలార్డ్, కృనాల్ పాండ్యా సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డారు. 20 బంతుల్లోనే తన అర్ధసెంచరీ పూర్తి చేసేశాడు పొలార్డ్. ఆ తర్వాత కృనాల్ (32), హార్దిక్ (16) ఔటయ్యారు. కానీ చివర్లో ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ చేశారు పొలార్డ్. చివరి ఓవర్లో 16 పరుగులు సాధించాల్సి ఉండగా నాన్ స్ట్రైకర్లో ఉన్న కులకర్ణికి బ్యాటింగ్ ఇవ్వకుండా తానే ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించారు.
Must Read ;- పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్.. కోల్‌కతాపై ఢిల్లీ విజయం











