టాలీవుడ్ విలక్షణ నటుల్లో రావు రమేష్ ఒకరు. తండ్రి రావుగోపాలరావు నట వారసత్వం పుణికి పుచ్చుకున్న ఆయన.. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. తండ్రి లాగానే ఇటు కామెడీ, అటు సీరియస్ విలనిజం పండించడంలో మాస్టర్ అనిపించుకున్నారు. అలాగే. మంచి పాత్రలు పోషించడంలోనూ, చక్కటి ఎమోషన్స్ పండించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రావు రమేష్ .. ఓ సినిమా కోసం గూనివాడి పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది.
‘ఆర్. ఎక్స్ . 100’ దర్శకుడు అజయ్ భూపతి తాజా చిత్రం ‘మహాసముద్రం’లో రావు రమేశ్ గూనివాడిగా అదరగొట్టబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. శర్వానంద్, సిద్ధార్ధ హీరోలుగు నటిస్తున్న ఈ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే వెరైటీ లవ్ స్టోరీ. ఇందులో రావు రమేశ్ కోసం ప్రత్యేకమైన రీతిలో ఓ జాలరి పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు. ఆ పాత్రలో ఆయనకి కాస్తంత నెగెటివ్ టచ్ కూడా ఉంటుందట.
నిజానికి రావు రమేశ్ గతంలో రామ్ చరణ్ , రాజమౌళి క్రేజీ మూవీ మగధీరలో అఘోరా స్టైల్లో ఉండే ఓ మాంత్రికుడి గెటప్ లో కనిపిస్తారు. ఆ పాత్ర మొత్తం గూనివాడి తరహాలో ఒంగునే కనిపిస్తుంది. ఇప్పుడు మహాసముద్రంలోని గూనివాడి పాత్రతో .. మగధీర ను గుర్తు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు గా నటిస్తోన్న మహాసముద్రం సినిమాకి రావు రమేశ్ పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.
Must Read ;- ‘పుడింగి నెంబర్ 1’ గా బర్నింగ్ స్టార్











