ఇజ్రాయెల్ లో విషాదం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి మౌంట్ మెరెన్ వద్ద జరిగిన తొక్కసలాటలో 44 మందికిపైగా మృతిచెందారు. మరో 60మందికిపైగా గాయపడ్డారు. యూదుల పండుగ అయిన లాగ్ బౌమర్ సందర్భంగా వేలాదిమంది భక్తులు మౌంట్ మెరెన్ వద్ద ప్రార్థనల కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలంలోనే 44 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా తొక్కిసలాట ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. లాగ్ బొమర్ ఘటన పట్ల పలు దేశాలు విచారం ప్రకటించాయి. అయితే, ఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన కచేరీ స్టాండ్ కూలడమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారుల విచారణలో తేలింది.
Must Read ;- ఆ ఘటన హృదయ విదారకరం.. హార్ట్ బ్రేకింగ్ ఫర్ ఇండియా











